‘సవ్యసాచి’ లగాయిత్తు అదిరింది…!

Ninnu-Road-Meeda-Song-Trail

అక్కినేని నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ‘సవ్యసాచి’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ జోరు పెంచారు. పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు నిర్వహించడంతో పాటు, వరుసగా ప్రమోషన్‌ వీడియోలను, పాటలను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్న నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు పాట టీజర్‌ను విడుదల చేయడం జరిగింది.

savya-sachi-movie-nagchaita

నాగార్జున సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ లో ఒక్కటైన నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు పాటను సవ్యసాచి చిత్రం కోసం కీరవాణి రీమిక్స్‌ చేశాడు. ఒరిజినల్‌ పాటను కూడా పాతికేళ్ల క్రితం కీరవాణి ట్యూన్‌ చేసిన విషయం తెల్సిందే. తాజాగా తన పాటకు తానే రీమిక్స్‌ చేసి కీరవాణి వదిలాడు. తాజాగా ఈ పాట టీజర్‌ను వదిలిన చిత్ర యూనిట్‌ సభ్యులు అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమా బాగుంటుందని, పాట చాలా బాగుందని సినీ వర్గాల వారు మరియు సోషల్‌ మీడియా జనాలు అంటున్నారు. రీమిక్స్‌ పాట చాలా బాగుంది, నాగచైతన్య డాన్స్‌ మరియు హీరోయిన్‌ స్టెప్పులు అదిరి పోయాయి. ఈ సినిమాలో ఈ రీమిక్స్‌ పాట తప్పకుండా హైలైట్‌ అవుతుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.