అతిలోక సుందరిగా అదిరిపోయిన రకుల్‌…!

Rakul Preet Singh To Play Sridevi In This Biopic

తెలుగులో ఎందరో స్టార్‌ హీరోలతో నటించి లేడి సూపర్‌ స్టార్‌గా పేరుగాంచిన తొలి నటి శ్రీదేవి. ఒకానొక సమయంలో ఈమె స్టార్‌ హీరోలతో సమానంగా పారితోషికాన్ని అందుకుంది. సీనియర్‌ ఎన్టీఆర్‌తో శ్రీదేవి చాలా చిత్రాల్లో నటించింది. వీరిద్దరి కాంభినేషన్‌లో పలు సూపర్‌హిట్‌లు వచ్చాయి. ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ను క్రిష్‌ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.

 

rakul-singh

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా శ్రీదేవి పాత్రలో రకుల్‌ను ఎంపిక చేశారు. అతిలోక సుందరి పాత్రలో రకుల్‌ బాగా నప్పుతుందని క్రిష్‌ ఈమెను ఎంపిక చేయడం జరిగింది. తాజాగా రకుల్‌ పుట్టిన రోజు సందర్భంగా అతిలోక సుందరి గెటప్‌లోని రకుల్‌ స్టిల్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. అతిలోక సుందరిగా రకుల్‌ అదరగొడుతుంది. శ్రీదేవి లుక్‌లో ఉన్న రకుల్‌ స్టిల్‌ మీకోసం…

rakul-smile