‘పడి పడి లేచె మనసు’ టీజర్‌ టాక్‌…!

Padi Padi Leche Manasu Teaser

యూత్‌ను ఆకట్టుకునే విధంగా ప్రేమ కథలను రూపొందించడంలో హను రాఘవపూడి దిట్ట అనే విషయం అందరికి తెల్సిందే. ఈయన శర్వానంద్‌, సాయిప్లవిల కాంభోలో ‘పడి పడి లేచే మనసు’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్‌. శర్వానంద్‌కు విభిన్నమైన కథలను ఎంచుకుంటాడు అనే టాక్‌ ఉంది. ఇక సాయి పల్లవి క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సహజంగా కనిపించి కుర్రకారుని కట్టి పడేసే అందం కలది. ఈ ఇద్దరి కాంభోలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు లేకపోలేదు.

padi-lechave

తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదల అయ్యింది. టీజర్‌లో సాయి పల్లవి మెడికోలాగా, శర్వానంద్‌ ఆమె వెంటపడడం, అందుకు సాయిపల్లవి క్లాస్‌ పీకడం చూపించారు. ఈ తరహా టీజర్‌ను చూసి కుర్రకారు ఊగిపోతున్నారు. ఒక్క టీజర్‌తోనే అంచనాలను అమాంతం పెంచేశారు. టీజర్‌ చూస్తుంటే సినిమా చూడాలనే కాంక్ష ఎక్కువుతుంది. యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం రూపొందిందని అదే తరహాలో టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ఓవరాల్‌గా చూస్తుంటే టీజర్‌తోనే మెప్పిస్తున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాపై మనసు పడేలా చేస్తుంది.