వెంకీ మామా నుండి కొత్త అప్డేట్…!

Finally Venky Mama To Start The Shoot

విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన సంగతే, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ నిర్మాతకు మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే ఫామ్ లో వెంకీ మరో మల్టీస్టారర్ కు రెడీ అయిపోతున్నాడు. కె యస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వెంకీ, నాగచైతన్య కాంబినేషన్ లో వెంకీమామ అనే మల్టీస్టారర్ తెరెకెక్కనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరుపుకోగా తాజాగా షూటింగ్ డేట్ ని ఖరారు చేసినట్టు సమాచారం.

ఫిబ్రవరి 21న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెంకీమామలో, చైతన్యకి జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుండగా, వెంకీ పక్కన శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లు వినబడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. నిజానికి బయట కూడా వెంకీ నాగచైతన్యకి మామే, ఇప్పటి వరకూ వీరిద్దరూ ప్రేమం సినిమాలో మాత్రమె కలిసి నటించారు, అది ఒక్క సీన్ లో మాత్రమే, ఇప్పుడు వీరి మధ్య ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయనుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నేలకోన్న్నాయి.