అల్లు స్నేహకు అరుదైన రికార్డు…!

A Rare Record For Allu Sneha

స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌లో రికార్డు ప్థాయిలో ఈయనకు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కేరళలో కూడా ఈయనకు అభిమాన బృందాలు చాలా ఉన్నాయి. మలయాళంలో బన్నీ సినిమాలకు బ్రహ్మరథం పడుతారు అక్కడి అభిమానులు.

 

allu-arjun-movies

ఇకపోతే బన్నీ స్టయిల్‌కు అంతా ఫిదా అవుతారు. ఒకప్పుడు లవర్‌ బాయ్‌గా ఉండే బన్నీ ప్రస్తుతం స్టయిలిష్‌ స్టార్‌గా మారిపోయాడు. బన్నీ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అభిమానుల కోసం తరుచూ సోషల్‌ మీడియాలోకి వస్తాడు. ఇక తన ఫ్యామిలీ ఫొటోస్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు.

snesh-reddy-allu-arjun

సోషల్‌ మీడియాలో రికార్డు స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ సతీమణి అు్ల స్నేహ కూడా బాగానే ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది. అల్లు స్నేహ కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో వన్‌ మిలియన్‌ ఫాలోవర్స్‌ చేరారు. తెలుగులో ఏ స్టార్‌ హీరో భార్యకు కూడా ఇంతమంది ఫాలోవర్స్‌ లేరు.

allu-arjun-wife

వన్‌ మిలియన్‌ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న స్టార్‌ హీరోల భార్యలు మొదటగా షాహిద్‌ కపూర్‌ సతీమణి మీరా రాజ్‌పుత్‌ ఆమె తర్వాత అల్లు స్నేహనే ఆ రికార్డు కొట్టేసింది. తమ అభిమాన హీరో సతీమణి అల్లు స్నేహ ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో బన్నీ అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఫీల్‌ అవుతున్నారు.

A Rare Record For Allu Sneha