ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య !

Abhijit Shinde commits Suicide

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్సర్ ఎన్నో సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పని చేసిన అభిజిత్ షిండే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముంబైలోని తన ఇంట్లో ఈరోజు ఉదయం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గదిలో సూసైడ్ నోట్‌ను గుర్తించిన పోలీసులు అతని మరణానికి ఎటువంటి కారణాలు కనుగొనకపోగా తన బ్యాంక్ ఖాతాను కుమార్తె పేరిట బదిలీ చేయాలని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు తెలిపారు. అభిజిత్ భార్య గత మూడు నెలల నుంచి ఆయనకు దూరంగా ఉంటున్నారని రెండేళ్ల వయసున్న వారి కుమార్తెను కూడా కలవడానికి ఆమె ఒప్పుకోకపోవడంతో అభిజిత్ కలత చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. Abhijit Shinde

గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అభిజిత్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఆయన ఇంటి తలుపు తెరిచి ఉండటంతో పక్కంటివాళ్లు వెళ్లి చూసేసరికి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించి, అతడిని కిందకు దించి హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే షిండే మృతిచెందినట్టు వైద్యులు నిర్దరించారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Abhijeet Shinde Age