అరుదైన రికార్డుకు చేరువలో ‘గీత గోవిందం’…!

Gita Govindam Movie Has Gained 50 Crores Collections

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. మొదటి అయిదు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఇక లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 50 కోట్ల షేర్‌ను దక్కించుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అతి త్వరలోనే 50 కోట్ల షేర్‌కు గీత గోవిందం చిత్రం చేరుకోబోతుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ వారాంతంలో భారీగా వసూళ్లు నమోదు అయితే స్టార్‌ హీరోలకు మాత్రమే సాధ్యం అయ్యే 50 కోట్ల షేర్‌ను ఈ చిత్రం దక్కించుకోనుంది అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

geetha-govindham

మొదటి వారం రోజుల్లో మంచి వసూళ్లను సాధించి, రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకు పోతున్న ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకున్నట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం వారాంతంలోనే కాకుండా, వీక్‌ డేస్‌లో కూడా మంచి వసూళ్లను రాబడుతుంది. దాంతో ఈ చిత్రం 50 కోట్ల షేర్‌ను చేరకోవడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టాక్‌ భారీ ఎత్తున ఉన్న నేపథ్యంలో, సినిమాకు పోటీగా మరో సినిమా లేని కారణంగా తప్పకుండా సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటూ సినీ పండితులు చెబుతున్నారు. విజయ్‌ దేవరకొండ గత చిత్రం అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని మించేలా ఈ చిత్రం వసూళ్లు నమోదు అవుతున్నాయి.

geetha-govindham