గీత గోవిందం తమిళనాట సంచలనం…!

Geetha Govindam Blockbuster In Tamil

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించిన ఈ చిత్రం తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం పదుల సంఖ్యల థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అటు తమిళనాట కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని బాహుబలి తర్వాత స్థానంలో నిలిచింది. ఏ ఇతర స్టార్‌ హీరోకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డును తమిళనాట విజయ్‌ దేవరకొండ దక్కించుకున్నాడు.

geetha-govindham-movie

‘గీత గోవిందం’ చిత్రం తమిళనాట పలు థియేటర్లలో ఈ చిత్రం 50 రోజులు ప్రదర్శింపబడినది. ఒక తెలుగు సినిమా, అదీ కాకుండా తెలుగు వర్షన్‌లో 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. తెలుగులో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. తమిళనాట ఈ చిత్రం బాహుబలి తర్వాత స్థానంలో నిలిచింది. తెలుగు సినిమాలు తమిళ ఆడియన్స్‌ను అంతగా అలరించిన దాఖలాలు లేవు. కాని ఈ చిత్రం మాత్రం దమ్ము దుమ్ముగా వసూళ్లు సాధించడంతో పాటు 50 రోజులు పూర్తి చేసుకుంది. గీత గోవిందం సక్సెస్‌తో నోటాకు అక్కడ మంచి ఓపెనింగ్స్‌ దక్కే అవకాశం ఉంది.

geetha-govindham