అల్లు అర్జున్ పార్టీ ఇచ్చి మరీ సెలెబ్రేట్ చేయించాడుగా…!

Allu Arjun Throws Party For Taxiwala Team

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని తెలుగు సినిమా యువనటులు అందరూ ఫ్రెండ్లీ స్టార్ అని కూడా అంటారు. ఏ యువనటుడు తన సినిమా ప్రీ-రిలీజ్ కి పిలిచినా ఇట్టే వాలిపోయి, ఆ సినిమా టీం పడ్డ కష్టం, వాళ్ళతో తనకున్న స్నేహం అన్నీ చెప్పేసి, సినిమాకి కావాల్సినంత బూస్ట్ తన నుండి ఇస్తుంటాడు. ఇప్పుడు వంతు విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా వంతు అన్నమాట. ఈ సినిమా మొన్న శనివారం విడుదలయ్యి, మాంచి కలెక్షన్స్ రాబడుతూ, ఇప్పటికే పెట్టిన బడ్జెట్ ని వెనక్కు రాబట్టేసింది. ఇక మూడో రోజు నుండి వచ్చే కలెక్షన్స్ అన్నీ నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు అన్నట్టే లెక్క. అందులోనూ ఈ సినిమా ని నిర్మించింది ఎస్కేయన్ అయినా, అందులో మేజర్ పార్ట్ జీఎ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ వారిదే.

Allu-Arjun-Throws-Party-For

జీఎ2 పిక్చర్స్ అనేది అల్లు ఫ్యామిలీ వారి గీత ఆర్ట్స్ యొక్క అనుబంధ సంస్థ అని అందరికి తెలిసిన విషయమే. కొత్త టాలెంట్ కి అవకాశాలు ఇచ్చి, చిన్న బడ్జెట్ లో సినిమాలు నిర్మించి, మాంచి లాభాలను పొందాలనే ఉద్దేశ్యం తో జీఎ2 పిక్చర్స్ ని ప్రారంభించారు. అలాంటప్పుడు జీఎ2 పిక్చర్స్ నుండి వచ్చి, విజయం సాధించిన టాక్సీవాలా సినిమా సక్సెస్ ని సెలెబ్రేట్ చేయకుంటే ఎలా? అందుకే నిన్న రాత్రి బీ-డబ్స్ లో టాక్సీవాలా టీం మొత్తానికి కలిపి ఒక లావిష్ పార్టీ ఇచ్చి, సక్సెస్ ని ఎంజాయ్ చేసి మరీ చేయించాడు. విజయ్ దేవరకొండ తో జీఎ2 పిక్చర్స్ వారిది రెండో సినిమా. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో గీత గోవిందం సినిమా వచ్చి, భారీ విజయాన్ని సాధించి అల్లు అరవింద్ కి కోట్లల్లో లాభాలను తెచ్చిపెట్టింది. ఏదేమైనా అల్లు అర్జున్ విజయవంతమైన మంచి సినిమాల టీం కి సక్సెస్ పార్టీలు ఇచ్చి మరీ కిక్ పంచడం మంచి విషయమే.

Allu-Arjun