ఖమ్మంలో పదిస్థానాలు తెరాస పార్టీనే గెలుస్తుందని జోస్యం చెప్తున్న కేసీఆర్

KCR Suggested TRS MPs Ask For Amendments

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల పది నియోజకవర్గాల్లో గెలుపు ఖచ్చితంగా తెరాస పార్టీదే అని ఆపద్ధర్మ సీఎం కెసిఆర్ జోస్యం చెప్పారు. అది నిజమో, అబద్ధమో డిసెంబర్ 11 న ఎలాగూ తేలిపోతుంది కానీ ఖమ్మంలో ప్రజాఆశీర్వాద సభ అంటూ ప్రజలని ఆశీర్వదించడానికి వచ్చాడో, తనని తెలంగాణ ప్రజలు మళ్ళీ సీఎం చేస్తారని ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాడో తెలియదు కానీ కెసిఆర్ ప్రసంగం మాత్రం కాస్త నీరసంగా సాగింది అనేది కాదనలేని విషయం. ఈరోజుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడాలనుకొనే అభ్యర్థుల నామినేషన్లకు గడవు కూడా 3 గంటలకి అయిపోయింది. ఇక ప్రచారమే తరువాయి అనుకోవడానికి లేకుండా ఎప్పుడో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాలకు పంపించేసి తెరాస పార్టీ, ఆ పార్టీ అభ్యర్థులకు అడుగడుగునా ఎదురవుతున్న ఛీత్కారాలు యాదికి వచ్చాయేమో మరి కెసిఆర్ ఎన్నడూ లేనంత నిదానంగా మాట్లాడాడు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ప్రజా మీటింగులలో. ఎప్పడూ మాట్లాడిన తనదైన కౌంటర్లు, విసుర్లు, ప్రత్యర్థులపై బూతులు సంధించే కెసిఆర్ యేనా ఇలా మాట్లాడింది అని సభకి వచ్చేసిన ప్రజలతో పాటు, కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయి, తమని తామే గిచ్చిచూసుకొని నిజమేనని తేల్చుకుంటున్నారు.

TRS chief and Telangana

ఖమ్మం జిల్లా సభల్లో కెసిఆర్ మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా ఉద్యమ చైతన్యం కలిగిన జిల్లా అని, కానీ తెలియని రాజకీయ కారణాల వలన సరైన ఫలితాలు అందుకోలేదనేది కాదనలేని విషయమని, ఇది ప్రజలందరూ తెలుసుకుంటే మంచిదని అన్నాడు. ఇదే కాకుండా, సభలో కనపడిన జనసందోహం ని చూస్తుంటే, పది కి పది నియోజకవర్గాలు తెరాస కైవసం చేసుకుంటుందని జోస్యం కూడా చెప్పి, అక్కడ ఉన్న అభ్యర్థులను సంతోషపరిచారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి చెప్పి, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అందరికి అందజేస్తామని నిలబెట్టుకోలేని హామీ ఇచ్చారు (ఈ ఐదేండ్లలో ఎందుకు ఇవ్వలేదో మరీ అని సభకు హాజరైన ప్రజలు ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ చెప్పుకుంటున్నారంటా). తమ మీద లేని పోనీ విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ కు చేసిందేమి లేదనే విషయాన్నీ ప్రజలు తెలుసుకోవాలని, అవి ఎన్ని టక్కు టమారా విద్యలు ప్రదర్శించినా, తెరాస విజయాన్ని అడ్డుకోలేవని అన్నారు. రాష్ట్రం లో ఏమి జరుగుతుందో తెలుసుకొని, ఏ పార్టీని ఎన్నుకుంటే రాష్ట్రానికి మంచిదో ఆలోచించుకొని ఓటు వెయ్యాలని ప్రజలని కోరారు. ఇంత చెప్తున్నా, ప్రజలు అనుకుంటున్నా విషయం ఏమిటంటే కెసిఆర్ లో మేకపోతు గాంబీర్యం కనిపిస్తుందని, మనిషి ఇదివరకు ఉన్న ఇదిలా లేడని, ఇంత తగ్గి మాట్లాడడం ఎందుకో అని అనుకుంటున్నారు.