బ్యాన్‌పై చాలా సీరియస్‌ అయ్యింది

Chinmayi Clarifications To The Netigen Doubts

తమిళ సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి మరోసారి వార్తల్లోకి వచ్చింది. లెజెండ్‌ రచయిత వైరముత్తు మరియు డబ్బింగ్‌ ఆర్టిస్టుల అసోషియేషన్‌ అధ్యక్షుడు రాజా లపై చిన్మయి చేసిన ఆరోపణలు ఇంకా కూడా చల్లారలేదు. మీటూ అంటూ చిన్మయి చేసిన ఆరోపణల కారణంగా తమిళ సినీ పరిశ్రమ షేక్‌ అవుతూనే ఉంది. గొప్ప వ్యక్తి గురించి చిన్మయి చిల్లర మాటలు మాట్లాడినది అంటూ కొందరు ఆరోపిస్తుంటే మరి కొందరు మాత్రం చిన్మయి మాటల్లో వాస్తవం ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా చిన్మయిని డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ నుండి తొలగించినట్లుగా ప్రకటించారు. దీనికి అధ్యక్షుడు అయిన రాజా తనకు తానుగా ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సమాచారం విమర్శలు వ్యక్తం అయ్యింది.

Samantha Decides To Support Chinmayi ,

తనను డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ నుండి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై చిన్మయి చాలా సీరియస్‌ అయ్యింది. తాను చేసిన ఆరోపణల్లో నిజం ఉన్నా కూడా తనను ఎందుకు బలి చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది. మీటూ అంటూ తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపును చెప్పుకుంటే ఇలా చేస్తారా అంటూ ఆమె ప్రశ్నిస్తోంది. ఈ విషయమై తాను ఎక్కడికైనా వెళ్తాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చిన్మయి త్వరలోనే ఇండియాకు వచ్చి, అప్పుడు ఈ విషయమై నేరుగా మీడియాతో మాట్లాడుతాను అంటూ చెప్పుకొచ్చింది. చిన్మయికి సినీ పరిశ్రమ ప్రముఖు మద్దతు తెలుపుతున్నారు. చిన్మయి పై ఒక వేళ నిషేదం కొనసాగితే ఇకపై సమంత కు మరెవ్వరైనా డబ్బింగ్‌ చెప్పాల్సి ఉంటుంది. అలా అయితే సమంత పాత్ర అంతగా పండదనే అభిప్రాయం అప్పుడే వ్యక్తం అవుతోంది.

Chinmani-samantha