అర్జున్‌ నన్ను చాలా సార్లు కాపాడాడు…!

Kushboo Supports Action King Arjun During Metoo

బాలీవుడ్‌లో మొదలైన మీ టూ ఉద్యమం ప్రస్తుతం సౌత్‌ను ఓ కుదుపు కుదిపేస్తుంది. కన్నడ హీరోయిన్‌ శృతిహరిహరన్‌ ఒక సినిమా సందర్భంలో స్టార్‌ హీరో అర్జున్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాంటూ ఆరోపణలు చేసింది. అర్జున్‌ చేసిన తప్పుకు శృతికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ప్రకాష్‌ రాజ్‌ మరియు శ్రద్దా శ్రీనాధ్‌ మొదలైన వారు డిమాండ్‌ చేస్తున్నారు. అర్జున్‌ అభిమానులు మాత్రం అర్జున్‌ అలాంటి వాడు కాదు అంటూ అర్జున్‌పై ఆరోపణలు చేస్తున్నవారిపై గుర్రుగా ఉన్నారు. అర్జున్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అర్జున్‌తో కలిసి నటించిన ఖుష్బూ తాజాగా స్పందించింది.

Kushboo

అర్జున్‌ నాకు 35 ఏళ్లుగా తెలుసు, అర్జున్‌ ఎప్పుడూ కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు, నాతోనే కాదు ఎవరితో కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తించడు. షూటింగ్‌ సమయంలో చాలామంది మీదిమీదకు వస్తుండగా అర్జున్‌ నన్ను చాలా సార్లు కాపాడాడు. వందలాది మందితో షూటింగ్‌లో పాల్గోంటున్నప్పుడు చాలామంది పైపైకి వస్తారు. అలాంటి సమయంలో ఆయన నన్ను కాపాడాడు. మహిళలంటే అర్జున్‌కు చాలా గౌరవం, అర్జున్‌ గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని ఎప్పుడూ కూడా ఊహించలేదు, ఎవరో చేస్తున్న ఆరోపణలు విని అర్జున్‌పై ఒక నిర్ణయానికి రావద్దు అంటూ ఖుష్బూ అర్జున్‌పై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది. సౌత్‌లో మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో అర్జున్‌ స్టార్‌ అవ్వడంతో అర్జున్‌పై వస్తున్న ఆరోపణలు హాట్‌ టాఫిక్‌గా మారాయి.

arjun