అప్పుడు చెయ్యేసినవాళ్లే.. ఇప్పుడు చేతులు కట్టుకుంటున్నారు…!

Metoo Actress Shakeela About Sexual Harassment In Film Industry

చిత్రసీమలో లైంగిక వేధింపులపై అలనాటి శృంగార తార షకీలా స్పందించారు. గతంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. #MeTooలో భాగంగా పరిశ్రమలో వేధింపులను బయటపెడుతున్న తారల గురించి స్పందిస్తూ.. తాను ఆలస్యంగా స్పందించే రకాన్ని కాదని, వెంటనే సమాధానం చెప్పేదానినని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘అమ్మాయిలకు లైంగిక వేధింపులు సాధారణమే. అయితే, అలాంటివి ఎదుర్కొన్నప్పుడు వెంటనే బయటపెట్టాలి.

Actress-Shakeela

ఏళ్లు గడిచిన తర్వాత చెప్పడం తెలివైన పనికాదు. చిత్రపరిశ్రమలో అడుగుపెట్టే చాలామంది ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్ని ఉంటారు. నాపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే, వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాను. ఆ రోజు నాపై చేతులు వేసినవాళ్లు… ఈ రోజు నన్ను చూస్తే చేతులు కట్టుకుంటారు’’ అని ఆమె తెలిపారు.