ఒక ఇల్లు = ఏడు ఇండ్లు : కెసిఆర్ భలే లెక్క చెప్పిండు…!

KCR Full Speech At Paleru Public Meeting

ఖమ్మంలో ఈరోజు జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కెసిఆర్ భలే లెక్క చెప్పిండు. కెసిఆర్ కట్టించే ఒక ఇల్లు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఏడు ఇండ్లతో సమానం అని, అందుకే ఎక్కువ సమయం పడుతుందని చెప్పి సభకు వచ్చిన ప్రజలని ఆశ్చర్యపరిచిండు. ఇంకో ఐదేండ్లు తీసుకుంటాడా ఏందో ఈ కెసిఆర్ సారూ. ఈ సభలో ఖమ్మం మరియు పాలేరు నియోజకవర్గ ప్రజలని ఉద్ధేశించి మాట్లాడిన కెసిఆర్, తాము ఉద్యమసమయంలో చేసిన వాగ్దానాలన్నీ, తప్పకుండ నెరవేరుస్తామని, ఇప్పటికే తమ 2014 ఎన్నికల్లో లేని హామీలైన పథకాలను కూడా ప్రవేశపెట్టామని, ఇవి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవని తెలిపారు.

double-bedroom-flat

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా ఉన్న మహాకూటమి నేతలు విమర్శిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని కట్టారు? దళితులకు ఎన్ని ఎకరాల భూములు ఇచ్చారు అంటున్నవాటిని పట్టించుకోవద్దని, తాము కట్టించి ఇచ్చే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ పార్టీలు కట్టించి ఇచ్చిన ఏడు ఇండ్లతో సమానం అని, అందరికి కట్టించి, ఇవ్వడానికి సమయం పడుతుందని, అర్హులైన అందరికి కట్టించితీరుతామని, స్థలం ఉన్నవాళ్ళకి కూడా ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేస్తామని ఇంకో పదేళ్లు అధికారంలో ఉన్న నెరవేర్చలేని హామీ ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదని, వంద శాతం సబ్సిడీ తో అందచేస్తున్నామని, తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో టీడీపీ మరియు కాంగ్రెస్ కట్టించి ఇచ్చిన ఇండ్లకు డబ్బులు కట్టాల్సిన పరిస్థితుల్లో తన వద్దకు వచ్చిన ప్రజల అప్పులు తీర్చమని తెలిపారు. యేరు లా తలపిస్తున్న జనసందోహం ని చూసి, ఖమ్మంలోని పది నియోజకవర్గాల్లో తెరాస విజయం తధ్యం అని కూడా చెప్పుకున్నారు.

kcr