చిత్రలహరి సినిమా షూటింగ్ మొదలయ్యింది…!

Sai Dharam Tej Chitralahari Shoot Begins

చిత్రలహరి – ఈ పేరు వినగానే 80 వ దశకంలో పుట్టిన పిల్లలకి గుర్తొచ్చేది దూరదర్శన్ తెలుగు ఛానల్ లో శుక్రవారం రోజున రాత్రి వచ్చే కొత్త పాటల కార్యక్రమం. కానీ, ఇప్పుడు ఈ చిత్రలహరి అనేది మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్న కొత్త సినిమా పేరు. దీనికి బార్ & రెస్టారెంట్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉందండోయ్. అంటే కొత్త పాటల కార్యక్రమం పేరుని ఒక బార్ & రెస్టారంట్ పేరుగా మార్చాడన్నమాట ఈ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేత థామస్ లు నటిస్తున్నారు. హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్న రెండో సినిమా ఇదికాగా, మెంటల్ మదిలో అంటూ తెలుగు ప్రేక్షకులను తన నటనతో మాయలో పడేసిన నివేత థామస్ కి కూడా ఇది రెండో సినిమానే తెలుగులో.

Sai Dharam and kishore tirumala

ఈ సినిమా షూటింగ్ ఈరోజే ప్రారంభం అయ్యింది. ట్యాగ్ లైన్ కి తగ్గట్లు గానే హీరోహీరోయిన్లు రెస్టారంట్ లో కూర్చొని, దర్శకుడు వివరిస్తున్న సన్నివేశాన్ని ఆసక్తికరంగా వింటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నాని చేయవలసిన ఈ సినిమాని సాయి ధరమ్ తేజ్ చెయ్యడం, కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకుడు కావడం, కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేత థామస్ లు హీరోయిన్లు అవ్వడంతో ఈ సినిమా పైన అంచనాలు మంచిగానే ఉన్నాయి. కిషోర్ తిరుమల నేను…శైలజ సినిమాతో రామ్ కి మంచి హిట్ ఇచ్చినా, ఆ తరువాత ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ప్లాపు ని కూడా ఇచ్చాడు. మరి ఈ చిత్రలహరి సినిమా తో ఎన్నాళ్ళనుండో హిట్ కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూస్తున్న సాయి ధరమ్ తేజ్ కి హిట్టు ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.

chitrala-hari