బండ్లని కూల్ చేసే ప్లాన్ చేసిన కాంగ్రెస్…!

Bandla-Ganesh-Appointed-As-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ ని వినిపించడానికి ఓ అధికార ప్రతినిధిని నియమించింది. ఆయన ఎవరో కాదండోయ్ బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించి నిరాశకు గురియైన ఆయనను బుజ్జగించేందుకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బండ్ల గణేష్ కొద్ది రోజుల కిందటే రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, షాద్ నగర్ స్థానాల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తాపత్రయపడ్డారు.

Telangana-Congress-Official

కాంగ్రెస్ లోని గాడ్ ఫాదర్ల సాయంతో తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పరిశీలన దశలోనే నాకౌట్ అయ్యారు. దాంతో బుజ్జగింపుల కసరత్తులో భాగంగా ఆయనకు పదవి కట్టబెట్టారు. బండ్ల గణేష్ కు అధికార ప్రతినిధి పదవి ఇవ్వడంపై చాలా మందిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున టీవీ చానళ్లలో డిస్కషన్ కు వెళ్తే పరువు పోతుందని ఆ పార్టీకి చెందిన కొంత మంది నేతలు అంటున్నారు. చిత్రవిచిత్రమైన మాటలతో ఆయన ఐడ్రీం ఇంటర్వ్యూలో నవ్వించారు. ఇంకేదైనా పదవి ఇచ్చి ఉంటే బాగుండేది కానీ అధికార ప్రతినిధి పదవి ఏమిటన్న అసంతృప్తి ఇతర కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తోంది.

Bandla-Ganesh-Appointed