కేరళకు మరో విలయం…రెడ్ అలెర్ట్…!

Red Alert In Three Districts Of Kerala

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో 350 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ దెబ్బకే ఇంకా పూర్తి స్థాయిలో కోలుకొని కేరళను మరో భయం వెంటాడుతోంది. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శని, ఆదివారాల్లో కేరళకు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాసం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 6 వరకు సాధారణ వర్షాలు పడతాయని, అప్పటివరకూ ఎల్లో అలర్ట్ ప్రకటన వచ్చిటన్లు కేరళ అధికారులు తెలిపారు.

kerala
మరోసారి విపత్తు హెచ్చరికల నేపథ్యంలో సమావేశంలో పినరయి విజయన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు. అలాగే తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవరకూ జాలర్లు సముద్రంలో వేటకు పల వేటకు వెళ్లవద్దని, రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన మూడు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రం మళ్ళీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

rain