మళ్లీ కీర్తి సురేష్‌తో చేయాలని…!

Vishal Pandem Kodi 2 Movie Heroine Keerthi Suresh

విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘పందెం కోడి 2’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే దసరాకు ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో విశాల్‌ పాల్గొంటున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌ గురించి విశాల్‌ మాట్లాడుతూ ఆకాశానికి ఎత్తేశాడు. ‘పందెంకోడి’ మొదటి పార్ట్‌లో మీరా జాస్మిన్‌ నటించిన విషయం తెల్సిందే. ఈ రెండవ పార్ట్‌లో మాత్రం కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించింది.

vishal-movies

‘పందెంకోడి’ మూడు నాలుగు పార్ట్‌లు కూడా చేయాలని కోరుకుంటున్నట్లుగా దర్శకుడు మరియు హీరో విశాల్‌ కోరుకుంటున్నారు. అందుకే ఈ చిత్రంకు సంబంధించిన సీక్వెల్‌ కథ అప్పుడే సిద్దం అవుతుంది. ఇక మూడవ పార్ట్‌కు సంబంధించిన చర్చ తారా స్థాయిలో జరుగుతున్న సమయంలో విశాల్‌ స్పందిస్తూ త్వరలోనే సీక్వెల్‌కు సంబంధించిన ప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక మూడవ పార్ట్‌లో కూడా హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ నటిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. కీర్తి సురేష్‌తో మళ్లీ మళ్లీ నటించాలని కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు.

vishal