అతడే బిగ్‌బాస్‌ విన్నర్‌.. లేదంటే దర్నాలే…!

Big Boss 2 Titel Winner Koushal

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 భారీ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకు పోతుంది. మొదటి సీజన్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ సీజన్‌ కూడా దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో పలువురు టైటిల్‌ విన్నర్‌ ఎవరు అనే విషయమై చర్చించుకుంటున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయిన రెండవ వారం నుండే కౌశల్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ఏర్పాటు అయ్యారు. ఫ్యాన్స్‌ ఏకంగా కౌశల్‌ ఆర్మీ అంటూ ఒక సోషల్‌ మీడియా గ్రూప్‌ను క్రియేట్‌ చేసి భారీ ఎత్తున కౌశల్‌కు మద్దతుగా క్యాపెయినింగ్‌ చేస్తున్నారు. కౌశల్‌ను ఎవరేం అన్నా కూడా వారిని ఎలిమినేట్‌ చేసే వరకు కౌశల్‌ ఆర్మీ వదలడం లేదు. ఇలాంటి సమయంలో కౌశల్‌ ఆర్మీ గురించి యాంకర్‌ రష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

koushal

తాజాగా యాంకర్‌ రష్మీ మాట్లాడుతూ నేను బిగ్‌బాస్‌ను ఫాలో అవ్వడం లేదు. కాని బిగ్‌బాస్‌లో జరుగుతున్న ప్రతి విషయం కూడా సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ పోస్ట్‌ు ఆసక్తికరంగా ఉంటున్నాయి అంటూ చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడు చూస్తున్న లీడ్స్‌ను బట్టి కౌశల్‌ టైటిల్‌ విజేత అవుతాడు అనిపిస్తుంది. ఒకవేళ కౌశల్‌ విజేత కాకుంటే దర్నాలు చేస్తారేమో ఆయన అభిమానులు. కౌశల్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆయన్ను గెలిపిస్తుందని రష్మి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న గీత మాధురి, కౌశల్‌ ఇంకా కొందరితో తనకు సన్నిహిత పరిచయం ఉందని, వారితో పలు సార్లు మాట్లాడటం జరిగిందని రష్మీ చెప్పుకొచ్చింది.

koushal