ఎన్టీఆర్ ప్లేస్ లో నాని

Nani Replaced NTR in Big boss season 2
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్ బాస్ -2 సీజ‌న్  పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింన‌గ‌ర్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఎన్టీఆర్ క్రేజ్ తో సూప‌ర్ సక్సెస్ సాధించిన బిగ్ బాస్ -1 కొన‌సాగింపుగా వ‌స్తున్న బిగ్ బాస్ -2కి  యాంక‌ర్ ఎవ‌రనేదానిపై అనేక వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టి చివ‌రిగా ఓ యువ హీరో వ‌ద్ద ఆగిపోయాయి. త్రివిక్ర‌మ్, రాజ‌మౌళి సినిమాల‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ బిగ్ బాస్ 2 సీజ‌న్ కు అందుబాటులో ఉండ‌లేన‌ని చెప్పిన త‌ర్వాత‌..నిర్వాహ‌కులు తీవ్ర నిరాశ చెందారు. బిగ్ బాస్ లో..పార్టిసిపెంట్స్, వాళ్ల మ‌ధ్య గొడ‌వ‌లు, హౌస్ లోప‌లి విశేషాల కన్నా ఎన్టీఆర్ యాంక‌రింగే ఎక్కువ పాపుల‌ర్ అయింది. మ‌రి రెండో సీజ‌న్ కు ఆ లోటు పూడ్చేలా యాంక‌రింగ్ చేసేవారు కావాలి. ఇందుకోసం బిగ్ బాస్ యాజ‌మాన్యం ర‌క‌రకాల హీరోల పేర్లు ప‌రిశీలించింది.

ఈ క్ర‌మంలో స్టార్ హీరోల నుంచి, యువ‌హీరోల దాకా చాలా మంది పేర్లు వినిపించాయి. వారిలో అంద‌రిక‌న్నా టాలీవుడ్ లో వైవిధ్య‌మైన హీరోగానే కాకుండా ఇటీవ‌ల నిర్మాత‌గానూ స‌క్సెస్ అయిన యువ హీరో నానిపై బిగ్ బాస్ యాజ‌మాన్యానికి గురికుదిరిన‌ట్టు తెలుస్తోంది. అభిమానులంతా నేచుర‌ల్ స్టార్ అని పిలుచుకునే నానికి యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. త‌న టైమింగ్, హావ‌భావాల‌తో బిగ్ బాస్ షో వ్యాఖ్యాత‌గానూ నాని మెప్పించ‌గ‌ల‌డని నిర్వాహ‌కులు భావిస్తున్నారు. అన్నింటిలోనూ విజ‌య‌ప‌థంలో దూసుకెళ్తోన్న నాని  బిగ్ బాస్ 2ను కూడా ర‌క్తిక‌ట్టిస్తాడ‌ని భావిస్తున్నారు.