బ్యాడ్‌ న్యూస్‌.. జంటగా కాదు!

Samantha Special Role in Naga Chaitanya Movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అక్కినేని నాగచైతన్య, సమంతలు పెళ్లి తర్వాత మొదటి సారి కలిసి నటించబోతున్నారు అంటూ గత వారం రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘నిన్ను కోరి’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. శివ నిర్వాన దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కడం నిజమే, అందులో నాగచైతన్య హీరోగా నటించడం నిజమే, కాని సమంత హీరోయిన్‌గా కాకుండా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లుగా సమాచారం అందుతుంది. 

ప్రస్తుతం ‘సవ్యసాచి’ మరియు ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాల్లో నటిస్తున్న నాగచైతన్య వేసవి చివరి నుండి శివ నిర్వాన సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. కోన వెంకట్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిచంబోతున్న ఆ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్య పాత్రలో సమంత చేసేందుకు ఒప్పుకోవడంతో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ను ఒప్పించే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. నిన్ను కోరి చిత్రంలో ఆది కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. అలాగే చైతూ మూవీలో కూడా సమంత అలాంటి ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. నాగచైతన్య, సమంతల రొమాన్స్‌ మరోసారి ఆన్‌ స్క్రీన్‌ చూడాలని ఆశించిన అక్కినేని ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులకు తీవ్ర నిరాశ తప్పలేదు.