గుండు హనుమంతరావు కన్నుమూత.

Comedian Gundu Hanumantha Rao Passes Away
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు తన కామెడీ తో అలరించిన గుండు హనుమంతరావు కన్నుమూశారు. కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఎస్సార్ నగర్ లోని సొంత ఇంటిలో కన్నుమూశారు. దాదాపు 400 సినిమాల్లో నటించిన గుండు హనుమంతరావు కి జంధ్యాల , ఎస్.వి. కృష్ణారెడ్డి సినిమాలతో మంచి పేరు వచ్చింది. ఇక అమృతం సీరియల్ తో గుండు హనుమంతరావు ప్రతి ఇంటి మనిషి అయిపోయాడు.

కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గుండు హనుమంతరావు కి వైద్య ఖర్చుల కోసం ఇటీవల మెగా స్టార్ చిరంజీవి , కమెడియన్ అలీ తో పాటు ఇంకొందరు సినీ రంగానికి చెందిన వాళ్ళు సాయం చేశారు. దాంతో వైద్యం చేయించుకున్న తరువాత ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చింది అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ తెల్లవారుజామున ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఎర్రగడ్డ లోని సెయింట్ థెరిస్సా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆయన్ని పరీక్ధించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు పోయినట్టు నిర్ధారించారు.