హైపర్‌ ఆది గురించి ఇంత చర్చ అవసరమా?

Truth About Hyper Aadi Secret Wedding Pic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Truth About Hyper Aadi Secret Wedding Pic In Social Media

జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది గత కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులను తనదైన స్టైల్‌లో పంచ్‌లతో ఆకట్టుకుంటున్నాడు. హైపర్‌ ఆది అంటే అదిరిపోయే పంచ్‌లు గుర్తుకు వస్తాయి. ఆయన దేనిపైనా అయినా పంచ్‌లు వేయగలడు. స్కిట్‌ మొత్తం పంచ్‌లతో నిండిపోతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి హైపర్‌ ఆది వివాహం చేసుకున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది. ఒక ఫొటో కూడా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారం ఏ స్థాయిలో ఉందంటూ ఎన్టీఆర్‌, మహేష్‌బాబు సినిమాల విడుదల సమయంలో ఎలా ఉంటుందో అలా ఉంది. ఏ ఒక్కరు చూసినా, ఎవరిని కదిలించినా కూడా హైపర్‌ ఆది పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు.

హైపర్‌ ఆది ఎవరికి చెప్పకుండా హఠాత్తుగా పెళ్లి చేసుకున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో ఆ ఫొటోకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. అసు విషయం ఏంటి అంటే ఆ ఫొటో ఒక సినిమాకు సంబంధించిన స్టిల్‌. హైపర్‌ ఆది ప్రస్తుతం ఒక చిన్న చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ సందర్బంగా పెళ్లి సీన్‌ చిత్రీకరణ జరిపారు. ఆ సందర్బంగా తీసిన ఈ ఫొటోను ఆ చిత్రానికి సంబంధించిన ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఆది పెళ్లి అయ్యింది అంటూ ప్రచారం మొదలైంది. ఆది ఈ విషయమై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తనకు పెళ్లి కాలేదు అంటూ ఆది క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా కొందరు ఆ ఫొటోను పట్టుకుని ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయినా ఒక చిన్న కమెడియన్‌ గురించి ఇంత హంగామా ఏంటో అర్థం కావడం లేదు.

 మరిన్ని వార్తలు:

శమంతకమణి… తెలుగు బులెట్ రివ్యూ.

ఆ ఎటాక్‌పై నాగబాబుకు ఏం సంబంధం?