అల్లరోడికి ఎంతటి దుస్థితి పట్టింది!

allari-naresh-is-based-on-the-hyper-aadhi-for-movie-promotion

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లరి నరేష్‌ మినిమం గ్యారెంటీ సక్సెస్‌ హీరో నుండి ఫ్లాప్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు అయిదు సంవత్సరాలుగా ఈయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తుంది. తాజాగా ఈయన నటించిన ‘మేడమీద అబ్బాయి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. అల్లరోడి గత సినిమా దృష్ట్యా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి లేదు. ఎంత ప్రచారం చేస్తున్నా కూడా సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిని చూపకపోవడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు హైపర్‌ ఆది సాయంను తీసుకుంటున్నారు. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న హైపర్‌ ఆది ‘మేడ మీద అబ్బాయి’ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. అందుకే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అల్లరి నరేష్‌తో సమానంగా హైపర్‌ ఆదిని మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. ఆది వేసే పంచ్‌లకు సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతుంది. ఎన్నో మంచి సినిమాలు చేసి హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న అల్లరి నరేష్‌ ఇప్పుడు తన సినిమా ప్రమోషన్‌ కోసం ఒక కమెడియన్‌, అది కూడా జబర్దస్త్‌ కమెడియన్‌పై ఆధారపడాల్సి వచ్చిందని అల్లరోడి ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అల్లరి నరేష్‌ మునుపటి స్థాయికి చేరుకోవాని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ‘మేడమీద అబ్బాయి’ సినిమా అల్లరోడికి మునుపటి వైభవం తెస్తుందా లేక హైపర్‌ ఆదికి హీరోగా ఛాన్స్‌లు తెస్తుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

సీడెడ్‌లో పవర్‌ చూపుతున్న బాలయ్య

దీక్షకు లక్కీ ఛాన్స్‌