పాఠాలు నేర్వని తేజూ పైకి రావడం కష్టం

Sai Dharam Tej Movie with Gopichand Malineni
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమా రంగంలో ఒక ఫ్లాప్‌ నుండి పది పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్తేనే కెరీర్‌లో విజయాలు అనేవి సాధ్యం అవుతాయి. ఏ రంగంలో అయినా పరాజయాలు కామన్‌, కాని ఆ పరాజయాల నుండి పాఠాలు నేర్చుకోకుంటే ఆ రంగంలో నెట్టుకు రావడం కష్టం. ముఖ్యంగా సినిమా రంగంలో పరాజయాలను విశ్లేషణ చేసుకోలేక పోతే కెరీర్‌ త్వరగా నాశనం అవుతుంది. గతంలో పలువురు అందుకు ఉదాహరణగా నిలిచారు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ కూడా పరాజయాల పాఠాలను ఒంట పట్టించుకోవడం లేదు. 

కెరీర్‌ ఆరంభం నుండి రెండు మూడు తప్ప పెద్దగా సక్సెస్‌లు లేని సాయి ధరమ్‌ తేజ్‌ అదే మూస తరహా స్క్రిప్ట్‌తో సినిమాలు చేస్తూ ఉన్నాడు. తాజాగా వచ్చిన విన్నర్‌, జవాన్‌, ఇంటిలిజెంట్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా, ఆ సినిమాలు ఎందుకు ఫ్లాప్‌ అయ్యాయి అనే విషయాన్ని విశ్లేషించుకోకుండా మళ్లీ అదే రొడ్డ కొట్టుడు తరహాగా సినిమాల ఎంపిక చేస్తున్నాడు. ఈ పద్దతి ఏమాత్రం ఆయన కెరీర్‌కు కరెక్ట్‌ కాదని, ఇప్పటికైనా తేజూ జాగ్రత్త పడకపోతే కెరీర్‌ మొత్తం నాశనం అవ్వడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తేజూ చేయబోతున్న చిత్రం పెద్ద సాహనం అని, ఇప్పటి వరకు గోపీచంద్‌ మలినేని చేసిన ఏ ఒక్క చిత్రం కూడా భారీ కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాయి. అయినా కూడా ఏదో నమ్మకంతో ఆయనతో సినిమాను చేసేందుకు తేజూ మళ్లీ సిద్దం అయ్యాడు. మరి ఈ చిత్రం అయినా తేజూకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.