వీడియో కాల్ లో ఆత్మహత్య వెనుక మిస్టరీ…

Haneesha Chowdary Hangs herself during Video Call
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఓ అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడుతూ హనీషా చౌదరి అనే ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ఏమిటో బయటకు రావడం లేదు. అప్పటిదాకా బాగా మాట్లాడుకున్న ఆ ఇద్దరి మధ్య ఒక్కసారిగా ఎందుకు తేడా వచ్చింది ?హనీషా చౌదరి అంత కఠిన నిర్ణయం తీసుకోడానికి కారణాలు ఏంటి ? ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యుల వాదన ఏంటో కూడా బయటకు రాకపోవడంతో అసలు ఏమి జరిగి ఉంటుంది అన్నదానిపై ఎన్నో సందేహాలు వస్తున్నాయి.

ఆత్మహత్య చేసుకున్న హనీషా చౌదరి అనంతపురం జిల్లా కి చెందిన టీడీపీ నాయకుడు బుగ్గయ్య చౌదరి కుమార్తె. ఇక హనీషా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్న వ్యక్తి దీక్షిత్ పటేల్. గుజరాత్ కి చెందిన అతను కూడా ఆమె చదువుతున్న కాలేజీ లోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు. శివ శివానీ కాలేజీ లో చదువుతున్న ఆ ఇద్దరూ స్నేహంగా మెలగేవారని మిగతా విద్యార్థులు చెబుతున్నారు. ఇద్దరి ప్రవర్తన కూడా సున్నితంగా ఉండేది అంటున్నారు. దీంతో హనీషా ఆత్మహత్య వెనుక ఇంకా ఏదైనా మిస్టరీ ఉందా అన్నది పోలీసులే డిసైడ్ చేయాల్సివుంది.