మళ్లీ టైటిల్‌తో ఆకట్టుకున్నాడు

Varun Tej next movie title Aham Brahmasmi
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ ఇలా వరుసగా చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకుంటూ వస్తున్నాడు. విభిన్న టైటిల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వరుణ్‌ తేజ్‌ సక్సెస్‌లను దక్కించుకుంటున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం అయిన ‘తొలిప్రేమ’ టైటిల్‌ను వాడేసి సూపర్‌ హిట్‌ను కొట్టాడు. టైటిల్‌కు మంచి ఆధరణ వస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అలా సినిమాపై అంచనాలు పెరుగుతున్న కారణంగా భారీగా వసూళ్లు వస్తున్నాయి. అందుకే వరుణ్‌ తేజ్‌ టైటిల్స్‌తోనే సగం సక్సెస్‌ను దక్కించుకుంటున్నాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘తొలిప్రేమ’తో సక్సెస్‌ను దక్కించుకున్న వరుణ్‌ తేజ్‌ తాజాగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. క్రిష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘కంచె’ చిత్రాన్ని నిర్మించి మంచి మార్కులు కొట్టేసిన దర్శకుడు క్రిష్‌ తాజాగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. ఒక వైపు బాలీవుడ్‌లో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న క్రిష్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు రావడంతో కథ ఎంతగా ఆయన్ను ఇంప్రెస్‌ చేసిందో చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం కోసం క్రిష్‌ తన బ్యానర్‌లో ‘అహం బ్రహ్మాస్మీ’ అనే టైటిల్‌ను వరుణ్‌ తేజ్‌ కోసం రిజిస్ట్రర్‌ చేయించాడు. చాలా పవర్‌ ఫుల్‌ టైటిల్‌గా ఉన్న టైటిల్‌తో మరోసారి వరుణ్‌ తేజ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇదే సంవత్సరంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.