ఈ రాజుగాడు వచ్చేదెప్పుడంటా?

Raj Tarun Raju Gadu movie release details
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కిన ‘రంగుల రాట్నం’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కి విడుదలైన ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. సంక్రాంతి కానుకగా రంగుల రాట్నం చిత్రం కాకుండా రాజ్‌ తరుణ్‌ నటించిన ‘రాజుగాడు’ అనే చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కాని రంగుల రాట్నం చిత్ర నిర్మాత అయిన నాగార్జున తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. అందుకే ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాతలు తమ ‘రాజుగాడు’ చిత్రాన్ని వాయిదా వేసి నాగార్జున కోసం రంగుల రాట్నంకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పుడు రాజుగాడు చిత్రం విడుదల చేసేందుకు సరైన సమయం దొరకడం లేదు.

జనవరి మొత్తం పెద్ద సినిమాలు విడుదల కాగా, ఫిబ్రవరిలో సరైన స్లాట్‌ రాజుగాడికి దక్కలేదు. మార్చిలో పరీక్షల సీజన్‌ అవ్వడంతో సినిమా విడుదల చేస్తే ఆత్మహత్యతో సమానం అంటూ నిర్మాతలు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికి మహేష్‌, రజినీకాంత్‌, బన్నీ వంటి స్టార్స్‌ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందుకే మే నెలలో సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కాని మే నెలలో కూడా పెద్ద సినిమాల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉందని, వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రాజ్‌ తరుణ్‌ ‘రాజుగాడు’ చిత్రం విడుదల ఇప్పట్లో అయ్యేలా లేదు.