చిన్న పెగ్‌తో రాబోతున్న ‘దేవదాసు’లు…!

Devadas Pre Release Business Collections 50 Crores

నానిల కలయికలో తెరకెక్కిన మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాసు’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇక ఈ చిత్రం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. భారీ ఎత్తున సినిమాపై అంచనాలు పెంచే విధంగా సినిమా టీజర్‌ ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రం టీజర్‌లో సినిమాపై ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు.

devadas

తెలుగులో ప్రస్తుతం మల్టీస్టారర్‌ చిత్రాల సందడి కొనసాగుతుంది. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలున్న కారణంగా దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ చిత్రం టీజర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించిన కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. గీత గోవిందం చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక ఈ చిత్రంతో మరోసారి సక్సెస్‌ను దక్కించుకుంటుందో చూడాలి. నాగార్జున, నానిల కలయికలో రాబోతున్న సినిమా సరికొత్త మల్టీస్టారర్‌ ట్రెండ్‌ను సెట్‌ చేస్తుందని సినీ వర్గాల వారు అంటున్నారు. నాని ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.

nani nagarjuna