సైరా …….. అంచనాలను పెంచిన ఆ ఇద్దరు !!!

rathnavelu and amit trivedi for sye raa

కొణిదెల కుటుంబం ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న సైరా చిత్రం పై అంచనాలని తన సంగీతం తో మాయాజాలం చేసి మరింతగా పెంచాడు అమిత్ త్రివేది .. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రహమాన్ ని పేరు ముందుగా తెర మీదకు వచ్చినా అనూహ్యం గా అవకాశం అమిత్ త్రివేది కి దక్కింది … ఈ చిత్రం తో మరో జాతీయ స్థాయి వైవిధ్యమైన సంగీత దర్శకుడు తెలుగు పరిశ్రమకి దొరికినట్లే… సైరా టిజర్ తో తన సంగీతాన్ని తెలుగు వారికి రుచి చూపించాడు … చరిత్ర మరిచిన చరితలని హృధ్యం గా వినిపించాడు … ఒళ్ళు గగుర్పొడిచే సంగీతం తో 18 వ శతాభ్ధం లో పయనించేలా చేయడం లో అమిత్ నెగ్గినట్లే..rathna veluదృశ్యం మాటలాడటం ఎన్నో కబుర్లను, కథ లను చెప్పడం … వాటిని ఒడిసి పట్టుకునే కెమెరామెన్ రత్నవేలు … సైరా తో రత్నవేలు కెమెరా కన్ను ప్రేక్షకులని బ్రిటిష్ కాలానికి తనతో పాటు లాక్కేలుతుంది … నేనొక్కడినే , బ్రహ్మోత్సవం , రంగస్థలం లాంటి చిత్రాలతో తన కెమెరా పనితనం ఏంటో ఇంతకు మునుపే చూపించాడు … రత్నవేలు పనితనంతో సైరా టీజర్ ప్రేక్షకులని రెప్ప వేయకుండా చేశాడు .. అడవిదొంగ లోని చిరు ని మల్లి ఒక్కసారి గుర్తుకు తెచ్చాడు … చిరు ని మరింత అందం గా , కొత్తగా చూపించి టీజర్ లో శబాష్ అనిపించుకున్నాడు .

amit trivedi