రాధాకృష్ణ పలుకులను నిజం చేసిన గీత

kothapalli githa lanch new party

అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీ పెడుతున్నారని రెండు రోజుల నుండి వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఆమె వైసీపీ నుండి గెలిచినా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్టు సమాచారం. ఇప్పటికే లేఖను లోక్‌సభ స్పీకర్‌కు పంపినట్టు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన (రేపు) ఉదయం 11.30 గంటలకు పార్టీని లాంచ్ చేస్తున్నామని విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రెస్, మీడియా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు అందాయి.kothapalli githaఇప్పటికే ప్రధాన పోటీ టీడీపీ-వైసీపీ మధ్య నెలకొని ఉంటుందని భావిస్తున్న తరుణంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ప్రభావం చూపించగలిగే జనసేన లాంటి పార్టీలతో పొత్తుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే తొలిసారి ఎంపీగా గెలిచినా వ్యక్తి పార్టీ స్థాపిస్తున్నారంటే ఆమె వెనుక ఉన్న శక్తీ ఎవరు ? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఆమె పార్టీకి బీజేపీ అండగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె పార్లమెంట్ లో వ్యవహరించిన తీరు మొదలు ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం వరకు ఆమె అవలంబించిన తీరు దానికి నిదర్శనం. ఇంకో ఆసక్తికర అమ్సమేమిటంటే ఆంధ్రజ్యోతిలో కొత్తపలుకు పేరుతో వేమూరి రాధాకృష్ణ రాసే సంపాదకీయంలో కొత్తపల్లి గీత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు ఆమె ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటించారు.