బిగ్‌బాస్‌ : ‘దేవదాస్‌’కు దెబ్బ పడేలా ఉంది

devadas

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2కు నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించి అందరి మనసులను గెలుచుకున్నాడు. కాని ఇప్పుడు నాని మాత్రం విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కౌశల్‌ అభిమానుల కారణంగా నానికి పెద్ద తలనొప్పి మొదలైంది. నాని హోస్ట్‌గా అన్‌ ఫిట్‌ అంటూ కౌశల్‌ ఆర్మీ గత కొన్నాళ్లుగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, సోషల్‌ మీడియాలో నాని పరువు తీసేలా పోస్ట్‌లు చేస్తున్నారు. కౌశల్‌ను చిన్న మాట అన్నా కూడా కౌశల్‌ ఆర్మీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇలాంటి సమయంలో నాని హీరోగా తెరకెక్కిన ‘దేవదాస్‌’ విడుదలకు సిద్దం అయ్యింది.

Nani

కౌశల్‌ ఆర్మీ ఫాలోవర్స్‌ ఇప్పటికే దేవదాస్‌ చిత్రంను బహిష్కరించాల్సిందే అంటూ పిలుపునిచ్చారు. ఇక సినిమా విడుదలైన తర్వాత దేవదాస్‌ పై సోషల్‌ మీడియాలో నెగటివ్‌ ప్రచారం చేసే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల సినిమాకు తప్పకుండా భారీ నష్టం తప్పదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. గతంలో సోషల్‌ మీడియలో సినిమాపై నెగటివ్‌ ప్రచారం సాగడంతో కొన్ని చిత్రాలు పాజిటివ్‌ రివ్యూలు వచ్చినా కూడా కలెక్షన్స్‌ రాలేదు. సోషల్‌ మీడియాలో సినిమాకు వ్యతిరేకంగా పరిచయం చేయడం వల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందనని మొత్తానికి నాని పెద్ద చిక్కుల్లో పడ్డట్లుగా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

kaushal army and nani