సలార్‌ లీక్‌లపై ఖచ్చితమైన హెచ్చరికలు!

సలార్‌ లీక్‌లపై ఖచ్చితమైన హెచ్చరికలు!
Cinema News

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి రోజు కూడా ఏదొక కారణంతో అయితే వినిపిస్తుంది. అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ మూవీ విషయంలో పలు లీక్ లు మేకర్స్ కి ఇబ్బంది కలిగించాయి.

ఏదొక కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంది . అయితే ఇప్పుడు ఈ లీక్స్ విషయంలో వాటిని స్ప్రెడ్ చేస్తున్నా వారికి మేకర్స్ ఒక షాక్ ఇచ్చారు. తమ కంటెంట్ ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసిన ఒక ఇద్దరిని అయితే సైబర్ క్రైమ్ వారు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

సలార్‌ లీక్‌లపై ఖచ్చితమైన హెచ్చరికలు!
Prabhas ” Salaar Movie”

దీనితో ఇక నుంచి ఎవరైనా సలార్ విషయంలో ఇలా చేస్తే వారికి కూడా ఇబ్బందులు తప్పవని కన్ఫర్మ్ చేసేసారు . మరి కొందరు అత్యుత్సాహకులు సోషల్ మీడియాలో విజ్ఞ్యాన ప్రదర్శనలు చేస్తే వారికీ ఇబ్బందులు ఎదురవ్వడం తప్పదని చెప్పాలి.