అనుష్కను ఢీ కొట్టబోతున్న మంచు విష్ణు

achari america yatra competing with anushka bhagmati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనుష్క ప్రధాన పాత్రలో ‘పిల్ల జమీందార్‌’ ఫేం అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు. అయితే పెద్ద సినిమాలు విడుదల ఉన్న కారణంగా జనవరి 26న విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ విడుదల చేసి, సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్‌లుక్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. దేవసేన తర్వాత మరోసారి భాగమతిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అని అంతా భావిస్తున్నారు. భారీ అంచనాలున్న ‘భాగమతి’ చిత్రానికి పోటీగా మంచు హీరో రంగంలోకి దిగేందుకు సిద్దం అవుతున్నాడు.

achari-america-yatra-releas

మంచు విష్ణు, జి నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో ‘దేనికైనా రెడి’, ‘ఈడో రకం వాడో రకం’ చిత్రాలు వచ్చాయి. రెండు కూడా పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక తాజాగా వీరిద్దరి కాంబోలో ‘ఆచారి అమెరికా యాత్ర’ తెరకెక్కింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం ముఖ్య పాత్ర పోషించడం చెప్పుకోదగ్గ విషయం. కంచె ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే సందర్బంగా జనవరి 26న విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు. నేడు దర్శకుడు నాగేశ్వరరెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్బంగా చిత్ర విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేయనున్నారు. మరి భాగమతితో ఢీ కొట్టడం అంటే సినిమాలో మ్యాటర్‌ ఉండాలి. మరి చిత్రంలో మ్యాటర్‌ ఉందా? అనుష్కకు పోటీగా మంచు విష్ణు నిలవలేస్తాడా అనేది చూడాలి.