మళ్లీ ముద్దుకు నో..!

Shalini Pandey Says No To Kissing Scenes In Next Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ సంవత్సరంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఏంటీ అంటే ఠక్కున వినిపించే పేరు ‘అర్జున్‌ రెడ్డి’. ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన షాలిని పాండేకు వరుగా ఆఫర్లు దక్కుతున్నాయి. విజయ్‌ దేవరకొండ, షాలిని పాండేల మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇద్దరి మద్య లెక్కలేనన్ని ముద్దు సీన్స్‌ సినిమాలో ఉన్నాయి. విజయ్‌ దేవరకొండతో మొదటి సినిమా చేసిన షాలిని పాండే హద్దులు దాంటి ముద్దులు పెట్టింది. ఆ ముద్దుల కారణంగా సినిమా ఆ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు షాలిని పాండే ముద్దులకు హద్దులు పెడుతోంది. 

తాజాగా షాలిని పాండేను ఒక దర్శకుడు అప్రోచ్‌ అయ్యాడు. ఆ చిత్ర కథలో భాగంగా దర్శకుడు ముద్దు సీన్స్‌ గురించి చెప్పాడట. హీరోతో ముద్దు సీన్స్‌ ఎక్కువ ఉంటాయని చెప్పడంతో వెంటనే నో చెప్పిందట. తన తదుపరి చిత్రాల్లో ముద్దు సీన్‌లు నో అని తేల్చి చెప్పిందట. ఒకటి అర సీన్స్‌కు కూడా నో అంటూ క్లారిటీ ఇచ్చింది. దాంతో ఆ దర్శకుడు నిరాశతో వెనుదిరిగాడు. ముద్దు సీన్‌లు కథలో భాగం అయినా కూడా ప్రస్తుతం ఏ హీరోతో మళ్లీ ముద్దు సీన్‌లు చేయదల్చుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె తెలుగులో రెండు చిత్రాలు చేయడంతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటిస్తూ ఉంది. ఇప్పుడు చేస్తున్న ఏ ఒక్క చిత్రంలో కూడా ముద్దులు పెట్టడం లేదని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఏమైనా ముద్దు సీన్స్‌ చేస్తే చేస్తానేమో కాని, ఇప్పుడు మాత్రం ముద్దుకు నో అంటూ క్లారిటీగా చెబుతోంది.