బుల్లితెర‌పైనా అర్జున్ రెడ్డి సంచ‌ల‌న‌మే..

Arjun Reddy movie achieved 13.6 TRP ratings
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వెండితెర‌పై గ‌త ఏడాది అర్జున్ రెడ్డి ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. చిన్న సినిమాగా వ‌చ్చి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ అందుకున్న అర్జున్ రెడ్డి తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. ఇప్పుడు బుల్లితెర‌పైనా కొత్త చరిత్ర సృష్టించింది అర్జున్ రెడ్డి. గ‌త నెల 21న ఆదివారం రోజు స్టార్ మాటీవీలో ప్ర‌సార‌మ‌యిన అర్జున్ రెడ్డి 13.6 టీఆర్పీ రేటింగ్ సాధించింది. సినిమాలో అభ్యంత‌ర‌క‌ర‌మైన స‌న్నివేశాలు తొల‌గించిన‌ప్ప‌టికీ…టీవీ ప్రేక్ష‌కులు రికార్డు స్థాయిలో అర్జున్ రెడ్డిని వీక్షించారు. దీన్ని బ‌ట్టి చూస్తే ముద్దు సీన్లు, శృంగార స‌న్నివేశాల వ‌ల్ల సినిమా విజ‌యం సాధించింద‌ని జ‌రిగిన ప్ర‌చారం నిజం కాద‌ని అర్దమ‌వుతోంది.

ఓ సాధార‌ణ ల‌వ్ స్టోరీని డిఫ‌రెంట్ గా చెప్ప‌డంలోనే అర్జున్ రెడ్డి స‌క్సెస్ దాగుంద‌ని సినీ విమ‌ర్శ‌కులు విశ్లేషిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌తో పాటు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, హీరోయిన్ షాలినీ పాండేల న‌ట‌న అర్జున్ రెడ్డిని విజ‌య‌తీరాలకు చేర్చింది. ఓ సినిమా విజ‌యం న‌టీన‌టుల జీవితాల‌ను ఎంతలా మార్చివేస్తోందో సందీప్ రెడ్డి, విజ‌య్, షాలినిల‌ను చూస్తే అర్ధ‌మ‌వుతుంది. అర్జున్ రెడ్డి త‌ర్వాత సందీప్ తో సినిమా చేసేందుకు అగ్ర హీరోలు పోటీప‌డుతుంటే…విజ‌య్, షాలినిల‌కు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి.