సీఎం లవర్‌ అర్జున్‌ రెడ్డి ముద్దులకు సిద్దం…!

Arjun Reddy Movie Remake In Bollywood

విజయ్‌ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్‌గా తెరకెక్కి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ప్రస్తుతం ఈ చిత్రం నాలుగు భాషల్లో రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఇంతటి సంచలన విజయాన్ని దక్కించుకున్న అర్జున్‌ రెడ్డి అన్ని భాషల్లో కూడా భారీ అంచనాల నడుమ రూపొందుతోంది. తమిళంలో ‘వర్మ’ పేరుతో భారీ ఎత్తున రూపొందింది. తాజాగా టీజర్‌ కూడా వచ్చేసింది. టీజర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. ప్రస్తుతం హిందీలో కూడా ఈ రీమేక్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. హిందీలో మరింత మసాలా యాడ్‌ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.

vijay

హిందీలో విజయ్‌ దేవరకొండ పాత్రను షాహిద్‌ కపూర్‌ పోషించబోతున్నాడు. ఇక హీరోయిన్‌ విషయంలో తాజాగా క్లారిటీ వచ్చేసింది. భరత్‌ అనే నేను చిత్రంతో సూపర్‌ హిట్‌ను అందుకుని ప్రస్తుతం రామ్‌ చరణ్‌, బోయపాటిల కాంబో మూవీలో నటిస్తున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ ఈ అర్జున్‌ రెడ్డి రీమేక్‌లో నటించబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది. ఎంతో మంది మెచ్చిన చిత్రంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాను. అర్జున్‌ రెడ్డి నాకు కూడా బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రంలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో కంటే హిందీలో ఎక్కువ బోల్డ్‌ సీన్స్‌ మరియు ముద్దు సీన్స్‌ ఉంటాయి అంటూ సమాచారం అందుతుంది. హాట్‌ సీన్స్‌కు ఏమాత్రం అడ్డు చెప్పకుండా హద్దు పద్దు లేకుండా గ్లామర్‌ ఒలకబోయడంలో కియారా ముందు ఉంటుంది. అందుకే అర్జున్‌ రెడ్డి హిందీ రీమేక్‌ రచ్చ రచ్చ ఉండటం ఖాయంగా అనిపిస్తుంది.

arjunreddy-movie