యంగ్‌ హీరో ఎట్టకేలకు ఫోన్‌ కొన్నాడు…!

Naga Shaurya Finally Buys Smart Phone

జనాలు 4జి, 5జి అంటూ మొబైల్స్‌ పట్టుకుని తిరుగుతుంటే, అడుక్కు తినే వారి వద్ద కూడా ఫోన్స్‌ ఉంటున్న ఈ సమయంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య మాత్రం నిన్నటి వరకు మొబైల్‌ను మెయింటెన్‌ చేయలేదు. ఈ విషయం గత కొంత కాలంగా అందరికి తెల్సిందే. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది మొబైల్‌ వాడమంటూ సలహా ఇచ్చినా కూడా ఆయన మాత్రం ఆసక్తి చూపించలేదు. ఎట్టకేలకు నాగశౌర్య మొబైల్‌ కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు.

nag-sourya-new-mobile

ఇన్నాళ్లు ఆయనతో మాట్లాడేందుకు ఆయన తల్లి ఉషా లేదా ఇంటి ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌కు చేయాల్సి వచ్చేంది. కాని ఇప్పుడు మాత్రం ఆయన నా సొంత నెంబర్‌కు చేయవచ్చు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేశాడు. ఇన్నాళ్లుగా మొబైల్‌ లేకుండా ఉన్న నాగశౌర్యకు ఇప్పటికిప్పుడు ఎందుకు ఫోన్‌ కొనుగోలు చేయాలని అనిపించిందో అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా పడుకున్న శౌర్య ఇక ప్రశాంతంగా ఉండలేడు. ఇన్నాళ్లు స్వేచ్చగా జీవించిన వ్యక్తి ఇకపై స్వేచ్చను కోల్పోతాడు అంటూ సోషల్‌ జనాలు కామెంట్‌తున్నారు. ఇక కొందరు నాగశౌర్య ప్రేమలో పడ్డాడేమో ఇప్పుడు మొబైల్‌ అవసరం వచ్చింది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి హీరో మొబైల్‌ కొన్నా కూడా వార్తే అయ్యిందని కొందరు గుణుక్కుంటున్నారు.

nag-sourya-movie