‘నర్తనశాల’ ప్రివ్యూ

Naga Shaurya nartanasala preview

నాగశౌర్య హీరోగా శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. సినిమా ప్రారంభం నుండి ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘ఛలో’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను అందుకున్న నాగశౌర్య మరోసారి తన సొంత బ్యానర్‌లో ఈ చిత్రాన్ని చేయడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. ఛలో చిత్రం తరహాలోనే నాగశౌర్య మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఉషా మాల్పూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ప్రమోషన్‌ విషయంలో కూడా స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో నిర్వహించడం జరిగింది. దాంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నర్తనశాల’ చిత్రం ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 nartanasala

‘ఛలో’ మేకర్స్‌ నుండి వస్తున్న చిత్రం అవ్వడంతో సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి తెరకెక్కించినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమాకు విడుదలకు ముందే పాజిటివ్‌ బజ్‌ రావడంతో అన్ని ఏరియాల్లో మంచి రేటుకు అమ్ముడు పోయిందని సమాచారం అందుతుంది. విడుదలకు ముందే నిర్మాత సేఫ్‌ అవ్వడంతో పాటు, కొద్ది మొత్తంలో లాభాలు కూడా వచ్చాయి అంటూ ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో హీరో గే గా కనిపించనున్నాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమాలో ఫుల్‌ కామెడీ ఉండటం ఖాయం అంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. నేడు హరికృష్ణ చనిపోవడంతో టాలీవుడ్‌ మొత్తం శోఖ సంద్రంలో మునిగి పోయింది. ఇలాంటి సమయంలో విడుదల చేయడం అంటే సాహసమే. అయినా కూడా ముందు నుండి అనుకుంటన్న తేదీ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ‘నర్తనశాల’ను విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు చెబుతున్నారు.

nartanasala-movie