రద్దయిన అక్కినేని వారి వేడుకలు

Devdas Song Single and Sailaja Reddy Alludu Movie Trailer akhil 3rd movie first look Release Postponed

నందమూరి హరికృష్ణ మరణించడంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. హరికృష్ణ మృతితో టాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నేడు నాగార్జున పుట్టిన రోజు అవ్వడంతో అక్కినేని ఫ్యాన్స్‌ మరియు హీరోలు పెద్ద ఎత్తున ప్లాన్‌ చేసుకున్నారు. నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా ‘దేవదాసు’కు సంబంధించిన ఒక పాటను విడుదల చేయాలని దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్య భావించాడు. దాంతో పాటు, నాగచైతన్య నటించిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మారుతి ఇటీవలే ప్రకటించాడు. ఇక అఖిల్‌ మూడవ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేసేందుకు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ఏర్పాట్లు చేశాడు.

Devdas Song Single and Sailaja Reddy Alludu

నేడు అక్కినేని ముగ్గురు హీరోల సినిమాలకు సంబంధించిన పోస్టర్‌, ట్రైలర్‌ మరియు పాటతో ఫ్యాన్స్‌ ఫిదా అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని షాకింగ్‌గా నందమూరి హరికృష్ణ మరణించడంతో అన్ని కూడా వాయిదా వేశారు. శైలజ రెడ్డి అల్లుడు ట్రైలర్‌ను విడుదల చేయడం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇవ్వగా, అఖిల్‌ మూవీ నుండి స్పందన లేకపోవడంతో ఫస్ట్‌లుక్‌ విడుదల వాయిదా వేసినట్లే అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి హరికృష్ణ మరణంతో అక్కినేని వారి వేడుకలు అన్ని కూడా రద్దు అయ్యాయి. ఈ సమయంలోనే నాగార్జున ట్విట్టర్‌లో హరికృష్ణతో ఉన్న అనుబంధంను గుర్తు చేసుకున్నారు. ఇటీవలే ఫోన్‌లో చూడక చాలా రోజలు అయ్యింది, కుద్దాం అన్నారు. ఇంతలోనే ఇలా జరిగింది అంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు.