హరికృష్ణ మృతికి కారణాలివే !

Reasons for accident of harikrishna

టీడీపీ నేత, సినీ నటుడు హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. అయితే హరికృష్ణ ప్రమాదానికి గల కారణాలు ఎస్పీ రంగానాథ్ వెల్లడించారు. అతివేగమే హరికృష్ణ మృతికి కారణమని ఆయన తెలిపారు. సీటు బెల్టు పెట్టుకుంటే ప్రమాద తీవ్రత తగ్గేదని, వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగడంతో వాహనం అదుపు తప్పిందని వెల్లడించారు. కారు డివైడర్‌ను ఢీకొని 15 మీటర్ల దూరంలో ఎగిరి పడిందని, డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆయన 20 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారని చెప్పారు. ప్రమాద సమయంలో కారు 160 కి.మీ వేగంతో వెళ్తోందని రంగనాథ్‌ వివరించారు.

harikrishna dead

బుధవారం ఉదయం 6.15 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి ఉదయం 4.30 గంటలకు బయలుదేరిన హరికృష్ణ నెల్లూరు వెళ్తున్నట్లు తెలిపారు. చిట్యాల దాటిన తర్వాత నార్కెట్‌పల్లి సమీపంలో గుంటూరు హైవేపై హరికృష్ణ ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పోలీస్ 12వ బెటాలియన్ గ్రౌండ్స్ దగ్గర కారు నియంత్రణ కోల్పోయింది. పక్కనే ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. వర్షాల కారణంగా రోడ్డు కూడా చిత్తడిగా ఉండటంతో కారు అవతలి వైపునకు ఎగిరి ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొట్టింది అని రంగనాథ్ తెలిపారు. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Hari-Krishna