నర్తనశాల గే కాదు…కామెడీ ప్రోమో

Narthanasala comedy promo

యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘@నర్తనశాల’. ఈ సినిమాలో నాగశౌర్య గే పాత్రలో నటిస్తున్నట్లు ట్రైలర్‌లో చెప్పకనే చెప్పారు. అయితే దీనిపై హిజ్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజాకు హిజ్రాలు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించవద్దని కోరారు. ‘నర్తనశాల’లోని గే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ గే టాక్ నుండి బయట పడేయడానికి చిత్ర యూనిట్ ఒక కామెడీ ప్రోమోను విడుదల చేసింది. గే అనే పోలికే లేకుండా ఉన్న ఈ ప్రోమో మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.