‘నోటా’ మొదటి రోజు కలెక్షన్స్‌

Nota Movie First Day Collections

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ చిత్రంకు మంచి ఓపెనింగ్స్‌ దక్కాయి. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని స్వయంగా తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడులో విడుదల చేశాడు. దాంతో నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకు భారీ మొత్తంలో లాభాలు దక్కడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటి రోజు ఈ చిత్రం 7.35 కోట్ల షేర్‌ను రాబట్టింది.

Nota Movie

ఏరియాల వారిగా ఈ చిత్రం దక్కించుకున్న షేర్‌ ఇలా ఉంది :

నైజాం : 1.93 కోట్లు
వైజాగ్‌ : 51 లక్షలు
ఈస్ట్‌ : 34 లక్షలు
వెస్ట్‌ : 23 లక్షలు
కృష్ణ : 30 లక్షలు
గుంటూరు : 42 లక్షలు
న్లెూరు : 20 లక్షలు
సీడెడ్‌ : 62 లక్షలు
తమిళనాడు : 1 కోటి
కర్ణాటక : 60 లక్షలు
ఓవర్సీస్‌ : 75 లక్షలు
ఇతరం : 45 లక్షలు
మొత్తం : 7.35 కోట్లు