తెలంగణ ఎన్నికల సమరం మొదలయ్యింది !

Telangana Elections 2018 Withdrawal Of Nominations For Telangana Elections Ends Today

తెలంగాణ సహా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఈరోజు విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో, మిగిలిన రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న ప్రకటిస్తామన్నారు. తెలంగాణ, రాజస్తాన్ లో ఒకే తేదీన అంటే డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు.

EVM

ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. నామినేషన్ దాఖలుకు 23 వరకూ గడవు ఇస్తామన్నారు. ఛత్తీస్ గఢ్ లో వచ్చే నెల 12న తొలి దశ పోలింగ్, 20న రెండో దశ పోలింగ్ ను నిర్వహిస్తామన్నారు. ఇక మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నవంబర్ 28న పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల కమిషన్ ప్రజలకు ఫొటోలున్న ఓటర్ స్లిప్పులను జారీ చేస్తుందనీ, ఇవి గుర్తింపు పత్రాలుగా ఉపయోగపడతాయని వెల్లడించారు. L ఎవరికి ఓటేశామో తెలుసుకునే వీవీప్యాట్ యంత్రాలను ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఈవీఎంలకు అమరుస్తామని వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ కు ముందు మాక్ పోలింగ్ ను నిర్వహిస్తామన్నారు.