అర్చ‌క గురుశిష్యులుగా బ్ర‌హ్మానందం, మంచు విష్ణు

Achari America Yatra theatrical Trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మంచు విష్ణు తాజా చిత్రం ఆచారి అమెరికా యాత్ర ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. విష్ణు సోష‌ల్ మీడియాలో ట్రైల‌ర్ షేర్ చేశారు. స‌ర‌దా స‌న్నివేశాల‌తో ఈ ట్రైల‌ర్ రూపొందింది. విష్ణు త‌న ప్రేయ‌సి కోసం అమెరికా వెళ్తూ మాయ‌మాట‌లు చెప్పి బ్ర‌హ్మానందం, మిగిలిన పండితుల బృందాన్ని కూడా తీసుకువెళ్తారు. పౌరోహిత్యం చేసే గురుశిష్యులుగా ట్రైల‌ర్ బ్ర‌హ్మానందం, మంచు విష్ణు క‌నిపిస్తున్నారు. అమెరికాలో వాళ్ల‌కు ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌ల‌తో ఈ క‌థ కొన‌సాగ‌నుంది. ట్రైల‌ర్ లో బ్ర‌హ్మానందం భ‌య‌పడుతూ ప్రాణాల‌తో ఇండియా వెళ్తామా అని ప్ర‌శ్నించ‌గా…వాడ్ని చంపైనా ఇండియా వెళ్దాం అని విష్ణు ఆయ‌న‌కు ధైర్యంచెబుతున్నారు.

న‌వ్వుల యాత్ర ప్రారంభం అనే క్యాప్ష‌న్ తో వ‌స్తున్న ఆచారి ఆమెరికా యాత్ర యాక్ష‌న్ కామెడీ చిత్రంగా తెర‌కెక్కింది. ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ ప‌తాకంపై కీర్తి చౌద‌రి, కిట్టు నిర్మించిన ఈ సినిమాకు జి.నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మంచు విష్ణు స‌ర‌స‌న కంచె ఫేం ప్ర‌జ్ఞా జైశ్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. గురుశిష్యులుగా బ్ర‌హ్మానందం, మంచు విష్ణు చేసే కామెడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంద‌న్న టాక్ విన‌ప‌డుతోంది. అదుర్స్ లో బ్ర‌హ్మానందం, ఎన్టీఆర్ మ్యాజిక్ ను వారు రిపీట్ చేస్తార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.