మోహన్ బాబు కామెంట్స్ తో సన్నిహిత పొలిటీషియన్స్ హర్ట్.

Mohan Babu Controversial Comments on politicians

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే దాని అర్ధం చిన్న భార్య మంచిది కాదని ఒకరు భాష్యం చెబుతారు. పెద్ద భార్య గురించి మాత్రమే అనుకున్నప్పుడు చిన్న భార్య ప్రస్తావన తేవడం ఏంటని ఇంకొందరు వాదిస్తారు. ఇలా ఒక్క మాటకే వేల రకాల భాష్యాలు. ఇక ఆ మాటలు మాట్లాడేది సెలెబ్రెటీస్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇండియా టుడే సదస్సులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పుడు పాలిటిక్స్ లో వున్న వారిలో 95 శాతం రాస్కెల్స్ అని మోహన్ బాబు గారు ధైర్యంగానే చెప్పారు. అంతవరకు ఓకే కానీ ఆయన స్నేహం చేసే వారిలో చాలా మంది రాజకీయ నాయకులు కనిపిస్తారు. వారు 95 శాతంలోకి వస్తారా లేక 5 శాతం లోకి వస్తారా అన్నదే ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న.

ఇక మోహన్ బాబు సినీ ఫంక్షన్స్ తో పాటు ఆయన నిర్వహిస్తున్న విద్యాసంస్థలకు సంబంధించి ఏ వేడుక జరిగినా రాజకీయ నాయకులు కూడా పెద్ద సంఖ్యలోనే కనిపిస్తుంటారు. అయితే పాలిటిక్స్ లో 95 శాతం మంది రాస్కెల్స్ అని చెప్పిన మోహన్ బాబు నాకు తెలిసిన వారిలో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అవినీతికి దూరం అని కూడా సెలవిచ్చారు. ఈ మాటలతో పైన మనం చెప్పుకున్నట్టు రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే చిన్నభార్య చిన్నబుచ్చుకోదా? . ఎన్టీఆర్ ఒక్కడే అవినీతికి దూరం అంటే ఇక మోహన్ బాబు ఎప్పుడు పిలిచినా వచ్చే మిగిలిన నాయకుల సంగతి ఏంటి ? అందుకే మోహన్ బాబు ఎప్పుడూ తన కోపం తనకే చేటు చేసిందని చెబుతుంటారు. ఇప్పుడు ఆవేశంలో చేసిన ఈ కామెంట్ కూడా రాజకీయాల్లో వున్న ఆయన సన్నిహితుల్ని హర్ట్ చేసింది. సినిమాల్లో డైలాగ్స్ ఎలా వున్నా దాని పరిధి, ప్రభావం కొంతవరకే. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. అందుకే పాలిటిక్స్ లో వున్న వాళ్ళు జనం గురించి పట్టించుకోకపోయినా ఓకే గానీ వారి గురించి ఎలా బడితే అలా మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవ్వరా మోహన్ బాబు గారు ?