సినీ నటుడు సుధాకర్ నాయుడు ఇంట తీవ్ర విషాదం

ప్రముఖ సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య శైలజ నిన్న మృతి చెందారు. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. శైలజ మృతి పలువురు సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. మరోవైపు, మహిళా హక్కుల నాయకురాలు సంధ్య… శైలజ మరణవార్త వినగానే అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శైలజ తనకు మంచి స్నేహితురాలని చెప్పారు. కుమారుడు, భర్త విషయంలో శైలజ చాలా కేర్ తీసుకునేదని తెలిపారు.