డ్రైవర్ మర్డర్…హీరోయిన్ అరెస్ట్

కర్నాటక పోలీసులు మూడు నెలల తర్వాత రౌడీ షీటర్ హత్య కేసులో నటిని, ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. కన్నడ సినీ నటి సవిత, ఆమె తల్లి నాగమ్మను సునీల్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాంపురం గ్రామానికి సునీల్ హత్య సంబంధించి ఇప్పటికే అతడి ప్రత్యర్థులు శివరాజు, మనులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విచారణలో ఈ హత్య వెనక సవిత, నాగమ్మ ప్రేమయం ఉన్నట్లు తేలింది. సవిత కారు డ్రైవర్‌గా సునీల్ పని చేసేప్పుడు ఇద్దరి మధ్య ఆర్థిక పరమైన వివాదాలు ఏర్పడ్డాయి. ఈ గొడవ కారణంగా సునీల్‌ను పనిలో నుంచి తీసేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వారిని బెదిరిస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. శివరాజు, మను వ్యక్తిగత కక్షలతో సునీల్‌ను చంపడానికి ప్లాన్ చేయగా…వీరికి సవిత నాగమ్మ సహాయం చేశారని పోలీసులు తెలిపారు. సునీల్ కదలికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందించడం మొదలు పెట్టారు. అతడి చంపేస్తే తమ సమస్య కూడా సాల్వ్ అవుతుందని వారు భావించినట్లు తెలుస్తోంది. సునీల్ రాంపుర పాంహౌస్‌లో ఉన్న విషయం సవిత, నాగమ్మకు తెలియడంతో ఈ సమాచారాన్ని శివరాజు, మనుకు అందించారు. దీంతో వారు ముందు అనుకున్న పథకం ప్రకారం అక్కడికి వెళ్లి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. కన్నడ చిత్రం ‘హెండతియోబ్బలు మనయోలగిద్దరే’ అనే చిత్రంలో సవిత లీడ్ రోల్ చేసింది. దీంతో పాటు తెలుగులో కూడా ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటించింది.