పిక్‌టాక్‌ : అవిక పనైపోయినట్లే!

Actress Avika Gour Slim Look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హిందీ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గౌర్‌ ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే మంచి మార్కులు దక్కించుకున్న అవికా గౌర్‌ పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా స్టార్‌డంను తెచ్చుకుంది. హీరోయిన్‌గా వరుసగా ఆఫర్లు వస్తున్నా కూడా కాస్త లావు ఎక్కువగా ఉంది అంటూ అవికపై విమర్శలు వచ్చాయి. దాంతో సినిమాలకు బ్రేక్‌ తీసుకున్న అవికా సన్నబడేందుకు కష్టపడుతూ ఉంది. గత నాలుగు నెలలుగా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్న అవికా ఎట్టకేలకు బయటకు వచ్చింది. తన కొత్త ఫొటోలను సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు అప్‌లోడ్‌ చేసింది. 

అవికా న్యూలుక్‌లో చాలా సన్నబడినట్లుగా కనిపిస్తుంది. అయితే మొహంలో మాత్రం మునుపటి కల కనిపించడం లేదు. ఎన్నో సినిమాల్లో ఆకర్షనీయమైన మొహంతో కనిపించిన అవికా గౌర్‌ ఈ ఫొటోలో అంతగా ఆకట్టుకోలేక పోతుంది. స్పీడ్‌గా బరువు తగ్గడం వల్ల మొహంపై ప్రభావం పడ్డట్లుగా కొందరు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి అవికాకు అవకాశాలు రావడం కష్టమే అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగులో అవికా ఇక సర్దేసుకోవాల్సిందే అనే టాక్‌ వినిపిస్తుంది. 

మరిన్ని వార్తలు:

ఇది మరీ ఓవర్‌ బోయపాటి

రెబల్‌స్టార్‌ కాదు.. బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌