అప్పుడు విజ‌య‌శాంతి…ఇప్పుడు న‌య‌న‌తార‌…

Nayantara Recorded 3 crores Remuneration
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విజ‌యశాంతి త‌ర్వాత లేడీ సూప‌ర్ స్టార్ ఇమేజ్ ద‌క్కించుకున్న హీరోయిన్ న‌య‌న‌తార‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌య‌న‌తార క్రేజీ హీరోయిన్. 80,90ల్లో విజ‌య‌శాంతికి తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉండేదో…ప్ర‌స్తుతం న‌య‌న‌తార‌కు త‌మిళంలో అంత క్రేజ్ ఉంది. అదే స‌మ‌యంలో తెలుగులోనూ ఆమెకు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ఇటీవ‌లే బాల‌కృష్ణ జై సింహాలో న‌టించిన న‌య‌న‌తార ఇప్పుడు చిరంజీవి సినిమా సైరా షూటింగ్ తో బిజీగాఉంది. ఈ సినిమాకు ఆమె తీసుకునే పారితోష‌కంపై ర‌క‌ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. చిరంజీవి పక్క‌న న‌టించిన హీరోయిన్ల‌లో అప్ప‌ట్లో అంద‌రిక‌న్నా విజ‌య‌శాంతి ఎక్కువ పారితోష‌కం తీసుకునేది. గ్యాంగ్ లీడ‌ర్ సినిమా కోసం ఆమె 90ల్లోనే కోటిరూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అందుకుంది.

ఇప్పుడంటే హీరోయిన్ కు రూ.కోటి అన్న‌ది కామ‌న్ కానీ..అప్ప‌ట్లో ఇంత రెమ్యున‌రేష‌న్ ఉండేది కాదు. అందుకే చిరంజీవి స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్ల‌లో విజ‌య‌శాంతి పారితోష‌కం చానాళ్ల‌వ‌ర‌కు రికార్డుగా మిగిలిపోయింది. ఆ రికార్డును చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో కాజ‌ల్ క్రాస్ చేసింది. ఆ సినిమా కోసం కాజ‌ల్ రూ. 2కోట్లు పారితోష‌కం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడు న‌య‌న‌తార ఆ రికార్డును చెరిపేసిన‌ట్టు స‌మాచారం. సైరా సినిమా కోసం న‌య‌న‌తార రూ. 3కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తెలుగు,త‌మిళ భాష‌ల్లో న‌య‌న‌తార‌కున్న క్రేజ్ దృష్ట్యా రూ. 3కోట్లు ఇస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ రెమ్యున‌రేష‌న్ తో చిరంజీవి క‌థానాయిక‌ల్లో న‌య‌న‌తార‌దే ఫ‌స్ట్ ప్లేస్ కు చేరుకుంద‌ని, ఇప్ప‌ట్లో ఈ రికార్డును మ‌రో హీరోయిన్ దాట‌డం క‌ష్టమేన‌ని ఫిలింన‌గర్ వ‌ర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఒక లేడీ సూప‌ర్ స్టార్ రికార్డును…మ‌రో లేడీ సూప‌ర్ స్టార్ తిర‌గ‌రాసింద‌న్న‌మాట‌.